కరోనా కేసులు : తమిళనాడులో 874, కేరళలో..

కరోనా కేసులు : తమిళనాడులో 874, కేరళలో..
X

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం తమిళనాడులో కొత్తగా 874 కరోనావైరస్ కేసులు నమోదు కావడంతో.. తమిళనాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,246 ఉన్నాయి. కొత్త కేసుల్లో చెన్నైలోనే 618 నమోదు అయ్యాయి. అలాగే కరోనా పూర్తిగా తగ్గిపోయిందనుకున్న కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 62 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులలో 33 మందికి విదేశాలకు ప్రయాణ చరిత్ర ఉంది, మిగిలినవి కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ కేసులుగా తెలుస్తోంది. కొత్త కేసులలో ఇద్దరు ఎయిర్ ఇండియా సిబ్బంది, ఒకరు జైలు ఖైదీ కూడా ఉన్నారు. కాగా భారతదేశంలో కరోనావైరస్ కేసులు 1.65 లక్షలు దాటగా, మరణాల సంఖ్య 4,706 దాటింది.

Next Story

RELATED STORIES