ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. లాయర్ నర్రా శ్రీనివాసరావు సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కేవియట్ వేశారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌నే ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని నిన్న హైకోర్టు తీర్పు వెలువరించింది. నిమ్మగడ్డ తొలగింపును తప్పుబట్టిన హైకోర్టు, ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర ప్రభు త్వానికి ఆ హక్కు లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కేవియట్ వేశారు.

Tags

Read MoreRead Less
Next Story