ఆగని సోనూ సాయం.. 177 మంది బాలికల కోసం విమానం..

వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసి అందరి అభిమానం అందుకుంటున్న బాలీవుడ్ నటుడు సోను సూద్ అక్కడితో తన సహాయాన్ని ఆపలేదు. ప్రతి రోజూ వలస కూలీలకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నారు. ఒక్క వలస కూలీలనే కాదు తన సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నారు. తాజాగా కేరళలో చిక్కుకున్న 177 మంది బాలికలను విమానంలో వారి రాష్ట్రానికి పంపించారు. ఈ అమ్మాయిలంతా కేరళలోని ఓ కుట్టు మిషన్ కర్మాగారంలో పని చేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూతపడింది. దాంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. సోనూ స్నేహితుడొకరు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. దాంతో వెంటనే సోనూ ఆ అమ్మాయిలందరికీ సహాయం చేయదలచి కొచ్చి, భువనేశ్వర్ విమానాశ్రయాలు నడపడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరారు. ఒక ప్రత్యేక విమానంలో వారిని కొచ్చి నుండి భువనేశ్వర్ చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వారు తమ ఇళ్లకు చేరుకుంటారు. సోనూ సూద్ సహాయం పొందిన ఓ గర్భిణీ తన కొడుక్కి సోనూ సూద్ శ్రీవాత్సవ అని పెట్టుకుంది. ఆ విషయం తెలిసి సోనూ తన హృదయం ఉప్పొంగి పోయిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com