ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం : ఏపీ విపత్తుల శాఖ

ఆంధ్రప్రదేశ్ లో ఉపరితల ద్రోణి కారణంగా నేటి నంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అంతేకాకుండా విశాఖపట్నం , విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని శుక్రవారం రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చిరించారు. విశాఖ జిల్లాలోని అనంతగిరి, హుకుంపేట, అరకులోయ అలాగే విజయనగరం జిల్లా: కురుపాం, పార్వతీపురం, గరుగుబిల్లి, బలిజిపేట, బొబ్బిలి, పాచిపెంట, సాలూరు, సీతానగరాలు. వేపాడ..
ఇక శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట, కొత్తూరు, పాలకొండ, బుర్జ, రేగిడి ఆమదాలవలస, సరుబుజ్జిలి, లక్ష్మీనర్సుపేట, హీరామండలం, వంగర, వీరఘట్టం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని కన్నబాబు చెప్పారు. దీంతో వ్యవసాయ పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపురులు చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా ఉండకూండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కమీషనర్ సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com