ట్రంప్ మరో సంచలన నిర్ణయం

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ట్రంప్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు షాక్ ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ట్రంప్ రాం రాం చెప్పేశారు. గతంలో ప్రక టించిన విధంగానే W.H.Oతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు. కరోనా నియంత్రణలో, వైరస్ సమాచారాన్ని పంచుకోవడంలో W.H.O దారుణంగా విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. కరోనా విష యంలో W.H.Oతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టం సంభవించిందని ట్రంప్ మండిపడ్డారు. W.H.Oకు ఇచ్చే నిధులను ఇకపై ఇతర ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని చెప్పారు.

చైనాకు కూడా ట్రంప్ షాక్ ఇచ్చారు. వైరస్ విషయంలో కీలక విషయాలను దాచిపెట్టినందుకు చైనాపై ఆంక్షలు విధించారు. అమెరికా స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో నమోదై, అమెరికా చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే చైనా పౌరులను ఇకపై అమెరికాలోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. అమెరికాలో చైనా పెట్టుబడుల విషయం లోనూ నిబంధనలను కఠినతరం చేస్తామన్నారు. కొన్నేళ్లుగా అమెరికాను చైనా కొల్లగొడుతోందన్న ట్రంప్, మేథో హక్కులతో పాటు బిలియన్ల డాలర్ల విలువైన పెట్టుబడులను అక్రమ మార్గంలో మళ్లిం చుకుందని మండిపడ్డారు. ఉద్యోగాల్లో నిబంధనలను అతిక్రమించిందని, వాణిజ్య విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధలను పాటించలేదని విమర్శించారు. చైనాతో నిర్మాణాత్మక బంధాన్నే కోరుకుంటున్నామని, ఐతే, అందుకోసం దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడలేమని తేల్చి చెప్పారు.

హాంకాంగ్ అంశంపైనా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హాంకాంగ్ స్వేచ్ఛకు తూట్లు పొడిచేలా చైనా తీసుకొచ్చిన జాతీయ భద్రతా బిల్లుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాంకాంగ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాకు ట్రంప్ గుడ్ బై చెప్పారు. 1984లో బ్రిటన్‌తో కుదిరిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని దుయ్యబట్టారు.

W.H.O విషయంలో నెల రోజుల క్రితమే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా కారణంగా అమెరికాలో లక్షమందికి పైగా చనిపోవడంపై ట్రంప్ రగిలిపోతున్నారు. ఇదంతా చైనా, W.H.O కారణంగానే జరిగిం దని దుయ్యబడుతున్నారు. చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తోలుబొమ్మలా మారిపోయిందని రుసరుసలాడుతున్నారు. W.H.Oలో సమూల మార్పులు జరగకపోతే ఆ సంస్థకు శాశ్వతంగా నిధులు నిలి పి వేస్తామని హెచ్చరించారు. తాజాగా W.H.Oతో అమెరికాకు ఉన్న దశాబ్దాల బంధాన్ని కట్ చేసేశారు.

Tags

Read MoreRead Less
Next Story