coronavirus : మహారాష్ట్రలో కొత్తగా 8,381 మంది రోగుల డిశ్చార్జ్

coronavirus : మహారాష్ట్రలో కొత్తగా 8,381 మంది రోగుల డిశ్చార్జ్

మహారాష్ట్రలో కరోనా నుంచి కొత్తగా 8,381 మంది రోగుల డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోని ఏ రాష్ట్రాలలో కూడా ఒక్కరోజులో ఇంత పెద్దఎత్తున కోలుకోవడం జరగలేదు. ఇంతమంది ఒకేసారి కోలుకోవడం కూడా ఇదే మొదటిసారి. దీంతో మహారాష్ట్రలో ఇప్పటివరకు 26 వేల 997 మంది రోగులు కోలుకొని ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో మొత్తం కేసులతో పోలిస్తే రికవరీ రేటు 43.3% గా ఉంది. అదే సమయంలో, మరణాల రేటు 3.37% గా ఉంది. మరోవైపు 2,682 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62 వేల 228 కు పెరిగింది. ఇదిలావుంటే గత 24 గంటల్లో రాష్ట్రంలో 116 మంది రోగులు మరణించారు.

దీంతో మరణాల సంఖ్య 2098 కి చేరుకుంది. శుక్రవారం ముంబై డివిజన్ నుండి 58, నాసిక్ డివిజన్ నుండి 32, పూణే డివిజన్ నుండి 16, కొల్హాపూర్ డివిజన్ నుండి 3, ఔరంగాబాద్ డివిజన్ నుండి 5 , అకోలా డివిజన్ నుండి 2 మంది మరణించారు. మృతుల్లో 77 మంది పురుషులు, 39 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 48 మంది 60 ఏళ్లు పైబడిన వారు కాగా, 55 మంది 40 నుంచి 60 మధ్య వయస్సు వారు ఉన్నారు, 13 మంది 40 ఏళ్లలోపు వారు ఉన్నారు. ఈ రోగులలో 65% మందికి డయాబెటిస్, గుండె జబ్బులు, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story