పీఎం కేర్స్ ఫండ్ ఆర్టీఐ చట్టం పరిదిలోకి రాదు: పీఎంఓ

పీఎం కేర్స్ ఫండ్ ఆర్టీఐ చట్టం పరిదిలోకి రాదు: పీఎంఓ
X

కరోనా కట్టడి కోసం పలువురి దాతల నుంచి సేకరించిన విరాళాలను పీఎం కేర్స్ లో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఈ పీఎం కేర్స్ నిధి సమాచారహక్కు చట్టం పరిధిలోకి రాదని ప్రధానిమంత్రి కార్యాలయం తెలిపింది. ఆర్టీఐ చట్టం కింద హర్ష అనే న్యాయవాది అడిగిన ప్రశ్నకు.. పీఎమ్ కేర్స్ నిధిని సమాచారం హక్కు చట్టంలో పేర్కొన్న ప్రభుత్వ వ్యవస్థగా పరిగణించలేమని వివరణ ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన వ్యవస్థలు కానీ.. ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన వ్యవస్థలు కానీ.. సమాచార హక్కు చట్టం ప్రకారం పబ్లిక్ అథారిటీగా పరిగణిస్తారు. అటు, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక సహాయంతో నడుస్తున్న ఎన్జీఓలు కూడా ఆర్టీఐ పరిదిలో వస్తాయి. అయితే.. పీఎంఓ సమాధానంపై న్యాయవాది హర్ష స్పందిస్తూ.. పీఎం కేర్స్ ఫండ్ కు ప్రభుత్వ ఆధీనంలో లేనప్పుడు.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దీనిపై పైకోర్టులో అపీలు చేస్తామని అన్నారు. పీఎం కేర్స్ కు ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా, రక్షణ, హోం, ఆర్థిక మంత్రులు ఎక్స్ అఫీషియో ట్రస్టీలుగా వ్యవహారిస్తున్నారు.

Next Story

RELATED STORIES