రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ అయిన రోహిత్ శర్మ

రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ అయిన రోహిత్ శర్మ

క్రీడాకారులకు ప్రకటించే అవార్డులకు బీసీసీఐ.. 2020కి పలువురుని నామినేట్ చేసింది. ప్రతిస్టాత్మక రాజీవ్ ఖేల్ రత్నా అవార్డుకు రోహిత్ శర్మను రేసులో పెట్టింది. అటు, ఇషాంత్ శర్మ, శిఖర్ ధవన్, దీప్తిశర్మలను అర్జున అవార్డుకు బోర్డు నామినేట్ చేసింది.

రోహిత్ శర్మ గత ప్రపంచకప్ మ్యాచ్ లో ఐదు సెంచరీలు చేశాడు. టీట్వంటీలో నాలుగు సెంచరీలు చేసిన మొదటి ఆటగాడు కూడా రోహత్. 2019లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నాడు.

ఇక శిఖర్ ధావన్ మొదటి టెస్టులోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ ధావన్ అందుకున్నాడు. ఇప్పటి వరకూ ఈ జాబితాలో మరో ఆటగాడు చేరలోదు. ఇలా పలు జాబితాల్లో అత్యంత వేగవంతమైన ఆడగాడిగా శిఖర్ ధావన్ రికార్డుకెక్కాడు.

ఆసియా వెలుపల ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా ఇషాంత్ కి గుర్తింపు వచ్చింది. అతి తక్కవ వయసులోనే అన్ని ఫార్మాట్లు ఆడిన భారత ఆటగాడినా ఇషాంత్ శర్మ గుర్తింపు పొందాడు. ఇక, టీమిండియా మహిళ జట్టు టాప్ క్లాస్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.

Tags

Read MoreRead Less
Next Story