చెక్‌పోస్టు వద్ద బారులు తీరిన ఏపీకి వెళ్లే వాహనాలు

చెక్‌పోస్టు వద్ద బారులు తీరిన ఏపీకి వెళ్లే వాహనాలు

ఆంక్షలు సడలించడంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలు పెరిగాయి. అయితే ముందస్తు అనుమతి లేకుండా ఏపీలోకి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద రద్దీ పెరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన కొవిడ్ కమాండ్ సెంటర్‌లో తెలంగాణ నుంచి వెళ్లినవారికి పరీక్షలు చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్నా క్వారంటైన్ స్టాంప్ వేసి పంపిస్తున్నారు. ఇతర దేశాలు, వేరే రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశించాలంటే తప్పనిసరి పరీక్షలు చేయించుకోవల్సిందేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పరీక్షల కోసం గంటలతరబడి నిరీక్షించాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలు నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్‌పోస్టు వద్ద క్యూకట్టాయి. అలాగే నాగార్జునసాగర్‌ బార్డర్ చెక్‌పోస్టు దగ్గర కూడా వాహనాలు బారులు తీరాయి. అటు సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం రామాపురం బార్డర్ చెక్‌పోస్టు దగ్గర కూడా ఇదే పరిస్థితి. ఈ చెక్‌పోస్టుకు రెండు వైపులా తెలంగాణ, ఏపీ వాహనాల రద్దీ పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story