ఒక్కరోజులో వెయ్యి కేసులు.. సరిహద్దులు మూసివేత

ఒక్కరోజులో వెయ్యి కేసులు.. సరిహద్దులు మూసివేత
X

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. నిత్యావసరాలకు అనుమతి ఇస్తామని అన్నారు. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని అన్నారు. దీని కోసం వాట్సాప్ నెంబర్ 8800007722, టోల్ ఫ్రీ నెంబర్ 1031కి కాల్ చేయొచ్చన్నారు. వచ్చే శుక్రవారం వరకు కాల్స్ తీసుకుంటామన్నారు. కాగా, ఢిల్లీలో ఇప్పటికే 20,000 పాజిటివ్ కేసులు నమోదవడంతో పాటు 473 మంది మరణించారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరగడంతో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న ఆదివారం ఒక్కరోజే 1000 కేసులు నమోదవడంతో సీఎం కేజ్రీవాల్ తాజా ఆదేశాలు జారీ చేశారు.

Next Story

RELATED STORIES