అదృష్గం కొద్దీ అలా చూళ్లేదు.. లేకపోతే ఐలవ్యూ చెప్పేదాన్నికాదు: సాక్షి

అదృష్గం కొద్దీ అలా చూళ్లేదు.. లేకపోతే ఐలవ్యూ చెప్పేదాన్నికాదు: సాక్షి
X

టీమ్ ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని ఇష్టపడని వారు ఎవరుంటారు. చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరకు ధోనీ ఆటతో పాటు అతని వ్యక్తిత్వమూ నచ్చుతుంది. యువతను అమితంగా ఆకర్షించే ధోని హెయిర్ స్టైల్ ఒకానొక టైమ్‌లో కొందరికి నచ్చలేదు. అందులో ధోనీ భార్య సాక్షి కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని సూపర్ కింగ్ అధికారిక ఇన్‌స్టా లైవ్ చాట్‌లో ఓ క్రికెట్ ప్రేమికురాలు రూపా రమణి ప్రస్తావించింది.

ఆమె ధోనీ అభిమాని కావడంతో తన స్టోరేజ్‌లో ఉన్న ధోని తొలి నాళ్ల ఫోటో ఒకటి పొడవాటి జుట్టు ఉన్నది చూపించారు. ఆఫోటోని చూసిన సాక్షి.. అదృష్టం కొద్దీ ధోనీని అలా చూడలేదు. చూసి వుంటే ఐలవ్యూ చెప్పేదాన్ని కానేమో.. శరీర సౌందర్యం గురించి ఎవరికి వారికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కానీ ధోనీ అభిమాని రూపా ప్రతిస్పందిస్తూ.. అలా కూడా ఇష్టపడ్డారని గుర్తు చేశారు. ఇక ధోనీతో పరిచయమయ్యాక చిన్న జుత్తుకు నారింజ రంగు వేయడం నచ్చలేదన్నారు సాక్షి.

అయితే ప్రేమలో పడ్డాకే ఈ హెయిర్‌స్టయిల్‌లో ధోనీని చూశానన్నారు. ఇక ధోనీ పరిచయం గురించి మాట్లాడిన సాక్షి సినిమాలో చూపించినట్టుగానే మా ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడిందని అన్నారు. అతడిని చూడగానే అందరి అబ్బాయిల్లానే చాలా సాధారణంగా కనిపించాడు. క్రికెట్ అంతగా చూసేదాన్ని కాదు కానీ సచిన్, ద్రవిడ్, గంగూలీ బాగా తెలుసు. ధోనీ గురించి తెలియదు. అయితే మా అమ్మ ధోనీ అభిమాని అని సాక్షీ కొన్ని స్వీట్ మెమరీస్ అభిమానులతో షేర్ చేసుకున్నారు.

Next Story

RELATED STORIES