ఢిల్లీలో నీతి ఆయోగ్‌ అధికారికి కరోనా పాజిటివ్

ఢిల్లీలో నీతి ఆయోగ్‌ అధికారికి కరోనా పాజిటివ్
X

ఢిల్లీలోని ఐసీఎంఆర్‌లో పనిచేసే ఓ శాస్త్రవేత్తకూ కరోనా వైరస్‌ సోకిన సంగతి మరవకముందే.. నీతిఆయోగ్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో నీతి ఆయోగ్ కార్యాలయంలోని మూడో అంతస్ధును సోమవారం మూసివేశారు. అనంతరం ఈ అంతస్థును పారిశుధ్య కార్మికులు శానిటైజ్ చేస్తున్నారు. మరోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

దాంతో మిగిలిన ఉద్యోగులందరినీ 14 రోజుల పాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లాలని, ఇంటి నుంచే పనిచేయాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కేసులు 19,000కు చేరువ కాగా, మహమ్మారి బారినపడి 416 మంది మరణించారు. దేశంలో 93,322 యాక్టీవ్ కరోనావైరస్ కేసులు ఉన్నాయి. మరణించిన వారి సంఖ్య 5,394 గా ఉంది.

Next Story

RELATED STORIES