కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని భారత వాతావరణ శాఖ ఐఎండి సోమవారం ధృవీకరించింది. ఈ మేరకు ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మోహపాత్రా ఋతుపవనాలపై ప్రకటన చేశారు. ఇక రుతుపవనాల ప్రభావంతో గత 24 గంటల్లో, కేరళలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కోజికోడ్‌లో 9 సెంటీమీటర్ల వర్షం నమోదైందని, అయితే కోజికోడ్‌లోని వడకరాలో 15 సెంటీమీటర్ల వర్షం నమోదైందని, ఇది కేరళలో గరిష్టంగా ఉందని ఐఎండి తెలిపింది. త్రివేండ్రంలో 6 సెం.మీ వర్షం కురిసింది. కేరళ తీరాన్ని రుతుపవనాలు కేరళకు చేరుకోవడానికి జూన్ 1 సాధారణ తేదీగా నివేదించిన సంగతి తెలిసిందే. ఇక ఈ రుతుపవనాలు ఉత్తర దిశగా ముందుకు సాగి జూలై 15 నాటికి మొత్తం దేశాన్ని కప్పేస్తుంది.

నైరుతి రుతుపవనాలు భారతదేశ రైతులకు , మొత్తం వ్యవసాయ రంగానికి జీవనాధారంగా ఉంటాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 9 జిల్లాలకు ఐఎండీ యల్లో అలర్ట్‌ జారీ చేసింది ఐఎండి. అందులో తిరువనంతపురం, కొల్లాం, పతనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం, కన్నూర్‌ జిల్లాలను అప్రమత్తం చేసింది. అలాగే మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుంటే గత సంవత్సరం ఈ నైరుతి రుతుపవనాలు జూన్ 8న కేరళ తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story