తాజా వార్తలు

టీకాంగ్రెస్‌లో అగ్గిరాజేస్తున్న అధ్యక్షుడి మార్పు అంశం

టీకాంగ్రెస్‌లో అగ్గిరాజేస్తున్న అధ్యక్షుడి మార్పు అంశం
X

టీపీసీసీ అధ్యక్షుడి మార్పు అంశం హస్తం పార్టీ పెద్దల మధ్య అగ్గిరాజేస్తోంది. ముందస్తు అంచనాలపై చేస్తున్న కామెంట్లపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని నియమిస్తే వ్యతిరేకిస్తామంటూ.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు మీద ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముందని జగ్గారెడ్డిని మందలించినట్టు తెలుస్తోంది. పీసీసీ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని.. ఈ విషయంలో ఎవరూ మాట్లాడొద్దని క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. దీనిపై స్పందించిన జగ్గారెడ్డి.. మరోసారి పీసీసీ మార్పు చేర్పులపై మాట్లాడబోనని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారట.

Next Story

RELATED STORIES