దేశ ప్రజలకు తీపి కబురు.. తొలకరి పలకరింత

దేశ ప్రజలకు తీపి కబురు.. తొలకరి పలకరింత

భారత వాతావరణ శాఖ, దేశ ప్రజలకు తీపికబురు చెప్పింది. తొలకరి పలకరింతకు సమయం వచ్చేసింది. మలబారు తీరాన్ని తాకడానికి నైరుతి వడివడిగా వచ్చేస్తోంది. రుతపవనాల రాకతో ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. మండే ఎండలు, భయంకరమైన ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు శుభవార్త. వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. జూన్ ఒకటో తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మలబారు తీరాన్ని తాకిన తర్వాత వారం నుంచి 15 రోజుల్లో దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరి స్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. నైరుతి ప్రవే శంతో వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

వాస్తవానికి, ఈసారి రుతుపవనాలు జూన్ ఐదో తేదీన మనదేశంలోకి ప్రవేశిస్తాయని తొలుత ‌అంచనా వేశారు. ఐతే, బంగాళాఖాతంలో తుఫాన్ కారణంగా నైరుతి వేగం పుంజుకుంది. అరేబియా మహాసముద్ర తీరంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాలకు విస్తరించాయి. ప్రస్తుతం రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తరించి ఉన్నాయి. దాంతో మరో 48గంటల్లో కేరళ తీరాన్ని తొలకరి పలకరించనుంది.

అన్నీ అనుకూలిస్తే జూన్ 6, 7 తేదీలకల్లా రాయలసీమకు నైరుతి విస్తరించే అవకాశముంది.

స్కైమేట్ మాత్రం రుతుపవనాలు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించాయని తెలిపింది. కేరళలో వాతావరణం, వర్షాల తీరే అందుకు నిదర్శనమని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story