జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు

జూన్ 19 న 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ దృష్ట్యా మార్చిలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు లాక్డౌన్ క్రమంగా సడలించబడుతున్నందున, కమిషన్ ఎన్నికల రాజ్యసభ ఎన్నికల తేదీని ప్రకటించింది. జూన్ 19 న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లలో నాలుగేసి సీట్లు, మధ్యప్రదేశ్ ,రాజస్థాన్ లలో మూడు, జార్ఖండ్ లో రెండు.. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ , మణిపూర్ నుండి ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
జూన్ 19 ఉదయం 9 గంటలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. కాగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసేటప్పుడు COVID-19 నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సూచనలు పాటించేలా చూడటానికి ఒక సీనియర్ అధికారిని నియమించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరినట్లు కమిషన్ తెలిపింది. ఫిబ్రవరిలో 17 రాష్ట్రాల్లో 55 సీట్లు భర్తీ చేయడానికి షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల సంఘం. అయితే మార్చిలో, 10 రాష్ట్రాల్లో 37 మంది అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com