గవర్నర్ తమిళిసైకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్.. గవర్నర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2న పుట్టిన తాను.. అదే తేదీన పుట్టిన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా రావడం విధిరాత అని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా సీఎం, గవర్నర్ మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత స్వాతంత్రోద్యమం తర్వాత అంత సుధీర్ఘ కాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలుస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారన్న సీఎం కేసీఆర్... వారి త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. అందుకే.. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులు అర్పించిన తర్వాతే పతాకావిష్కరణ చేస్తామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com