దూసుకొస్తున్న నిసర్గ తుపాన్ : వణుకుతున్న గుజరాత్, మహారాష్ట్ర..

దూసుకొస్తున్న నిసర్గ తుపాన్ : వణుకుతున్న గుజరాత్, మహారాష్ట్ర..
X

కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న మహారాష్ట్ర , గుజరాత్ రాష్ట్రాలకు రోకటిపోటులా తుఫాను ముప్పు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. నిసర్గ తుఫాను జూన్ 3 న దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ దృష్ట్యా, మహారాష్ట్ర తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

ప్రస్తుతం, ఈ తుఫాను ముంబై నుండి 490 కి.మీ, గోవా రాజధాని నుండి 280 కి.మీ , గుజరాత్ లోని సూరత్ కు 710 కి.మీ. దూరంలో ఉంది. మరోవైపు నిసర్గ తుఫాను రాబోయే 12 గంటల్లో పెను తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముంబై చుట్టుపక్కల జిల్లాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన రెండు జట్లను పాల్ఘర్‌లో, ముంబైలో మూడు, థానేలో ఒకటి, రాయ్‌గడ్‌లో రెండు, రత్నగిరిలో ఒక బృందాన్ని మోహరించారు.

Next Story

RELATED STORIES