భారత్ లో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. 24 గంటల్లో..

భారత్ లో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో దేశంలో 8 వేల 171 కేసులు నమోదయ్యాయని , 204 మరణాలు సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు, covid19india.org ప్రకారం, మంగళవారం ఉదయం నాటికి కరోనా సోకిన వారి సంఖ్య 1 లక్ష 99 వేల 166 కు చేరుకుంది. అంతకుముందు సోమవారం మహారాష్ట్రలో 2361,
తమిళనాడులో 1162, ఢిల్లీలో 990, గుజరాత్‌లో 423, ఉత్తర ప్రదేశ్‌లో 286, పశ్చిమ బెంగాల్‌లో 271, రాజస్థాన్‌లో 269, హర్యానాలో 265, మధ్యప్రదేశ్‌లో 194, కర్ణాటకలో 187, జమ్మూ కాశ్మీర్‌లో 155, బీహార్‌లో 138 మందికి కరోనా సోకింది. మరోవైపు, రోగుల సంఖ్య పరంగా భారతదేశం ప్రపంచంలో 7 వ దేశంగా అవతరించింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్ మరియు ఇటలీ లలో పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com