ఢిల్లీ బీజేపీలో నాయకత్వ మార్పు..

ఢిల్లీ బీజేపీలో నాయకత్వ మార్పు..
X

ఢిల్లీ భారతీయ జనతా పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంపీ మనోజ్ తివారీని ఢిల్లీ యూనిట్ నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిగా ఆదేశ్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. గుప్తా నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు ఛత్తీస్‌గడ్ అధ్యక్షుడిగా విష్ణుదేవ్ సాయిని నియమించారు. అయితే మనోజ్ తివారీని పదవి నుంచి ఎందుకు తొలగించారనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కాగా లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించారనే ఆరోపణలతో పార్టీ కార్యకర్తలతో పాటు మనోజ్ తివారీని సోమవారం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES