షాపింగ్ మాల్‌లో సందడి చేసిన పావురం.. ఎస్క్‌లేటర్ బెల్ట్ మీద ఎక్కి.. వీడియో వైరల్

షాపింగ్ మాల్‌లో సందడి చేసిన పావురం.. ఎస్క్‌లేటర్ బెల్ట్ మీద ఎక్కి.. వీడియో వైరల్
X

ఏవో తింటూ నడుస్తుంటారు. ఏం తింటున్నారో.. ఇంకా అసలు అక్కడ ఏం దొరుకుతాయో చూద్దామని మా నివాసం వదిలి మాల్‌కి వస్తే ఇలా బుక్కయ్యానేంటి. అందరూ ఎస్క్‌లేటర్ ఎక్కి వెళ్తున్నారని నేనేమో వెరైటీగా ఉంటుందని ఎస్క్‌లేటర్ బెల్ట్ మీద ఎక్కాను. అంతే అలా జారిపోతోంది. నా గుండె కూడా జారిపోతుంటే ఆగకుండా నా రెక్కల్ని ఆడిస్తూ నన్ను నేను కాపాడుకున్నాను. బతుకు జీవుడా.. మళ్లీ ఇంకోసారి వస్తే ఒట్టు. హ్యాపీగా వాళ్లూ వీళ్లూ వేసిన గింజలేవో తింటూ బతికేయక.. ఇక్కడికి ఎందుకొచ్చానో ఏమో గానీ.. ఇంకెప్పుడూ రాకూడదు బుద్ది వచ్చిందని ఎగిరిపోయింది పావురం. పావురం విన్యాసాలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోని 47000 మంది చూడగా దాదాపు 700 మంది కామెంట్లు పెట్టారు.. పావురం ట్రెడ్‌మిల్ ఎక్స్‌ర్సైజ్ ఎంత బాగా చేస్తోందని అంటున్నారు.

Next Story

RELATED STORIES