అన్‌లాక్‌ మొదటి దశ మొదలైంది.. మరో వారంలో రెండో దశ : ప్రధాని మోదీ

అన్‌లాక్‌ మొదటి దశ మొదలైంది.. మరో వారంలో రెండో దశ : ప్రధాని మోదీ
X

సీఐఐ 125వ వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల్లో వృద్ధి చెందాలని CII మిత్రులను అభ్యర్థిస్తున్నాం అన్నారు. అలాగే PPE ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించామని చెప్పారు. దేశంలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాతో ఉపాధి అవకాశాలు పెంచాలి అని వ్యాఖ్యానించిన మోదీ.. మేడ్‌ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్‌ ఉత్పత్తులు రావాలన్నారు. అన్ని రంగాల్లోనూ ఉత్పత్తి పెంచెందుకు లక్ష్యాలు నిర్ణయించుకోవాలని, భవిష్యత్తులో అభివృద్ధిని CIIని అంచనావేసి ముందుకు వెళ్లాలి, ఈ సందర్బంగా గ్రామాల్లోనూ అభివృద్ధి దిశగా CII అడుగులు వేయాలని సూచించారు.

కరోనా తర్వాతి పరిస్థితులను CII లాంటి సంస్థలు ఎదుర్కోవాలి అన్నారు, దేశ ప్రగతిలో వ్యాపారవేత్తల భాగస్వామ్యం మరువలేనిదని అన్నారు. గెట్టింగ్ గ్రోత్‌ బ్యాక్ అంత కష్టమేమి కాదన్నారు. MSMEల్లో పనిచేసే కోట్ల మంది కార్మికులకు ప్రయోజనాలు కల్పిస్తున్నాం అని అన్నారు. పేదల కోసం ఇప్పటికే 50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక దశాబ్దాలుగా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని దూరం చేశాం అన్నారు.

కరోనా పరిస్థితుల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం ఆయన.. లాక్ డౌన్ కు సంబంధించి అన్ లాక్ మొదటి దశ పూర్తయిందని మరో వారంలో రెండో దశ మొదలవుతుందని అన్నారు. జూన్‌ 8 తర్వాత మిగిలిన రంగాల్లోనూ అన్‌లాక్ ఉంటుందని చెప్పారు. ఇక ఈ ట్రేడింగ్ ద్వారా రైతులు తమ పంటలను అమ్మోకోవచ్చని చెప్పారు. దేశంలో అనేక బొగ్గు నిక్షేపాలున్నాయన్న మోదీ.. బొగ్గు రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు.

వినూత్న ఆలోచనలతోనే అన్ని రంగాల్లో వృద్ధి సాధ్యం- మోదీ

తోలు ఉత్పత్తుల్లో మనం మరింతగా వృద్ధి సాధించాలి- మోదీ

నమ్మకం, నాణ్యత, పోటీతత్వం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ముఖ్యం- మోదీ

దేశంలో ఉపాధి పెంచేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నాం- మోదీ

ఇంటిగ్రేడెట్‌, ఇంటర్ కనెక్టివిటీతో కార్యక్రమాలు చేపడతాం- మోదీ

ప్రైవేటు రంగాన్ని ఎప్పడూ ప్రోత్సహిస్తాం- మోదీ

ఈ-ట్రేడింగ్‌ ద్వారా రైతులు పంటలను అమ్ముకోవచ్చు- మోదీ

జీఎస్టీ ఫలితాలు రాబోతున్నాయి- మోదీ

CII 125వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. లైవ్ చూద్దాం.

ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేలా కృషి చేయాలి- మోదీ

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే మా లక్ష్యం- మోదీ

కరోనా నుంచి ప్రజలను రక్షించుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి- మోదీ

కరోనా కాలంలో ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్‌తో కొత్త ఒరవడి- మోదీ

రైతులు, MSMEలకు చేయూల అందించాం- మోదీ

ప్రస్తుత సవాళ్లన్నీ తాత్కాలికమే- మోదీ

దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు చేపడుతున్నాం- మోదీ

బ్యాంకుల విలీనం, జీఎస్టీ వంటి సాహస నిర్ణయాలు తీసుకున్నాం- మోదీ

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఆత్మ నిర్భర్ అభియాన్‌- మోదీ

లాక్‌డౌన్‌తో పారిశ్రామిక రంగానికి ఇబ్బందులు వచ్చాయి- మోదీ

రైతులకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని మా ప్రభుత్వం సరిచేసింది- మోదీ

గెట్టింగ్ గ్రోత్ బ్యాక్ పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నాం- మోదీ

Next Story

RELATED STORIES