భారత్ లో 73శాతం కరోనా మరణాలు అందువల్లే.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

భారత్ లో 73శాతం కరోనా మరణాలు అందువల్లే.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

గత 24 గంటల్లో 3,708 కోవిడ్ -19 రోగులు కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.

దీంతో ఇప్పటివరకు 95,527 కోవిడ్ -19 రోగులు కోలుకున్నారు. రికవరీ రేటు ఇప్పుడు 48.07% గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకు కోవిడ్ ద్వారా 5,598 మంది మరణించారు. దేశంలో మరణాల రేటు 2.82% గా ఉందని.. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ అని లవ్ అగర్వాల్ తెలిపారు.

అంతేకాదు 73% శాతం మరణాలు ఇతర అనారోగ్య కారణాలతోనే సంబవిస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించడానికి అనుమతి పొందిన 681 ప్రయోగశాలలు ఉన్నాయని.. 2020 జూన్ 1 నాటికి ప్రభుత్వ రంగంలో 476, ప్రైవేటు రంగంలో 205 ఉన్నాయని.. దీంతో ప్రతిరోజూ 1 లక్ష 20 వేల పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇండియన్ కౌన్సిల్ వైద్య పరిశోధన శాస్త్రవేత్త నివేదా గుప్తా తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story