కఠినంగా మారిన హృదయం.. కన్నతల్లిదండ్రులే కరోనా సోకిందని 9 నెలల చిన్నారిని..

కఠినంగా మారిన హృదయం.. కన్నతల్లిదండ్రులే కరోనా సోకిందని 9 నెలల చిన్నారిని..

కరోనా మనుషుల హృదయాలను ఎందుకింత కఠినంగా మార్చేసింది. తొమ్మిది మాసాలు మోసిన తల్లి తన బిడ్డ కరోనా సోకి మరణించాడని తెలుసుకుంది. గుండెలవిసేలా రోదించింది కానీ తనివి తీరా హృదయానికి హత్తుకోలేకపోయింది. అంత్యక్రియలు సైతం ఆస్పత్రి వారినే చేయమని చెప్పారు బిడ్డను కన్న తల్లిదండ్రులు. యూపీలోని రామ్‌పూర్ జిల్లాకు చెందిన 9 నెలల బాలుడు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు బాలుడి తల్లిదండ్రులు. మెరుగైన వైద్యం చేయించేందుకు దిల్లీ ఎయిమ్స్‌కు తీసుకొని వచ్చారు. వైద్యం చేస్తున్న క్రమంలోనే మే 29న బాలుడు మరణించాడు. బాబు మృతికి ముందే కరోనా పరీక్షలు చేయించడంతో పాజిటివ్ అని వచ్చింది. దాంతో చిన్నారి మృత దేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ముందుకు రాలేదు. మీరే అంత్యక్రియలు నిర్వహించండి అని ఎయిమ్స్ వైద్యులకు లిఖిత పూర్వక లేఖ రాసి ఇచ్చారు. దాంతో హాస్పిటల్ సిబ్బందే చిన్నారి అంత్యక్రియలు నిర్వహించింది. బాబు తల్లిదండ్రులను, చిన్నారికి వైద్యం అందించిన ఆస్పత్రి సిబ్బందిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story