బబ్లూ బయటకు ఎందుకెళుతున్నావని అడిగితే.. అక్షయ్ కుమార్

బబ్లూ బయటకు ఎందుకెళుతున్నావని అడిగితే.. అక్షయ్ కుమార్
X

అరే బబ్లూ బయటకు ఎందుకు వెళుతున్నావు.. కరోనా వస్తుంది వెళ్లొద్దని చెబుతున్నారు కదా. నీకు భయం లేదా కరోనా అంటే.. అని ఓ పెద్దాయన బబ్లూ పాత్రధారి అక్షయ్ కుమార్‌ని అడుగుతాడు. దానికి తాను తిరిగి పనిలోకి వెళుతున్నానని ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తానని చెబుతాడు. ముఖానికి మాస్క్ పెట్టుకున్నాని, పని చేసేటప్పుడు సామాజిక దూరం పాటిస్తానని, చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో క్లీన్ చేసుకుంటానని చెబుతాడు. ఇలా చేయడం అంటే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడు కోవడమే అని అక్షయ్ చెబుతాడు. ఇదంతా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ యాడ్ తాలూకూ వీడియో. ఇప్పుడు ఈ యాడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది. ప్రతి ఒక్కరూ అందులో చెప్పినట్లు విధిగా పాటించాలనీ చెబుతోంది.

Next Story

RELATED STORIES