47 ఏళ్ల క్రితం.. మేమిద్దరం..

47 ఏళ్ల క్రితం.. మేమిద్దరం..
X

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బుధవారం తన 47వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. 1973 జూన్ 3న అమితాబ్, జయా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా బిగ్‌బీ తన పెళ్లి నాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆరోజును గుర్తు చేసుకున్న అమితాబ్.. జంజీర్ సినిమాలో మేమిద్దరం నటించాము. ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో స్నేహితులందరం కలిసి లండన్‌లో వేడుకలు చేసుకుందామనుకున్నాం. అదే విషయాన్ని నాన్న హరివంశరాయ్ బచ్చన్‌కు చెబితే.. ముందు జయను పెళ్లి చేసుకుని ఆ తరువాత లండన్ వెళ్లు అన్నారు. లేదంటే లండన్ వెళ్లొద్దన్నారు. దాంతో జూన్ 3, 1973న బంధువుల సమక్షంలో జయను వివాహం చేసుకున్నాను. అదే రోజు రాత్రి ఇద్దరం కలిసి లండన్ వెళ్లాము అని ఆనాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు. జయ, అమితాబ్‌లు కలిసి మొదట నటించిన చిత్రం బన్నీ బిర్జు. ఇది 1972లో వచ్చింది. ఆ తర్వాత అభిమాన్, ఏక్ నజర్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

Next Story

RELATED STORIES