ఆర్మీ అధికారినంటూ మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు

ఆర్మీ అధికారినంటూ మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు

పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏకంగా ఆర్మీ అధికారుల పేరు చెప్పుకొని.. జనం నుంచి అందినకాడికి దండుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. హైదరాబాద్ శివారు.. శంషాబాద్‌లో ఓ వ్యాపారిని బురిడీ కొట్టించేందుకు విఫలయత్నం చేశారు కేటుగాళ్లు.

శంషాబాద్‌లో కార్‌ డెకర్స్ షాపు నిర్వహించే వసీంకు ఓ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను ఆర్మీ అధికారిని అని ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టు పనిచేస్తున్నాని నమ్మించాడు. ఆర్మీ డ్రెస్‌లో దిగిన ఓ ఫేక్ ఫోట.. ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా పంపాడు. తన కారుకు సీటింగ్ కవర్స్ వేయాలని.. డ్రైవర్‌ను పంపుతున్నానని చెప్పాడు. డబ్బులు ఎంతో చెబితే ఫోన్‌పే ద్వారా చెల్లిస్తానని అన్నాడు. ఫోన్‌పేకు పంపిన లింక్‌ను ఓపెన్ చేయాలని కోరాడు. దీంత వసీంకు అనుమానం వచ్చింది. మీరు పంపిన లింక్‌ను ఎందుకు ఓపెన్ చేయాలంటూ ప్రశ్నించాడు. వాళ్ల సంభాషణను రికార్డు చేసి పోలీసులను ఆశ్రయించాడు వసీం.

ఇది కచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనేనని.. ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల జనం జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు పోలీసులు. తెలియని వ్యక్తులు పంపే ఎలాంటి లింక్‌లను ఓపెన్ చేయవద్దని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story