జైలు నుంచి విడుదలైన జెస్సికా లాల్‌ హంతకుడు

జైలు నుంచి విడుదలైన జెస్సికా లాల్‌ హంతకుడు

మోడల్ జెస్సికా లాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మను శర్మతో పాటు మరో 18 మందిని విడుదల చేయడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర మాజీ మంత్రి వినోద్ శర్మ కుమారుడు మను శర్మ 14 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సెంటెన్స్ రివ్యూ బోర్డు సిఫారసులను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆమోదించారు. దాంతో మను శర్మ జూన్ 1న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. హత్యలో జీవిత ఖైదు అనుభవిస్తున్న మను శర్మను సత్ప్రవర్తన కలిగి ఉన్నందున విడుదల చేయాలని మే 11న ఢిల్లీ సెంటెన్స్ రివ్యూ బోర్డు (ఎస్‌ఆర్‌బి) సిఫారసు చేసింది.

కాగా1999 లో జెస్సికా లాల్‌ దారుణహత్యకు గురైంది. ఈ కేసులో మనుశర్మపై అభియోగాలు మోపి మను శర్మను హైకోర్టు 2006 డిసెంబర్‌లో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. అయితే ఆ తరువాత ట్రయల్ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది, కాని హైకోర్టు ఈ ఉత్తర్వును తిప్పికొట్టింది.. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్ 2010 లో జీవిత ఖైదును సమర్థించింది. దాంతో 14 ఏళ్లుగా మనువర్మ తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే లైంగికదాడి, హత్య, దోపిడీతోపాటు హత్య, ఉగ్రవాదంతో కూడిన హత్యలకు పాల్పడేవారికి విధించే 14 ఏండ్ల జైలుశిక్ష పూర్తిచేసుకొన్న వారికి జైలు నుంచి విడుదల చేసేందుకుగాను మార్గదర్శకాలు ఉండటంతో సెంటెన్స్ రివ్యూ బోర్డు సిఫారసుల మేరకు జైలునుంచి విముక్తి లభించింది.

Tags

Read MoreRead Less
Next Story