తాజా వార్తలు

హ్యాపీ బర్త్‌ డే బావా : కవిత

హ్యాపీ బర్త్‌ డే బావా : కవిత
X

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో.. తనదైన ముద్ర వేసిన వ్యక్తి.. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌ రావు. ఆయన ఈ రోజు 49వ వసంతంలో అడుగు పెడుతున్నారు. TRS.. కెసిఆర్ తర్వాత అంతటి వాగ్ధాటి కల నాయకుడాయన. తెలంగాణ వాదాన్ని వినిపించడంలో గానీ ప్రత్యర్ధులకు సమాధానం చెప్పడంలో దిట్ట. తెలంగాణలో ప్రజాదరణ పొందిన ప్రజా ప్రతినిధిగా హరీష్ రావు తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రతీ ఎన్నిక ఎన్నికకు మెజారిటీ పెంచుకుంటూ రికార్డు సృష్టించి ఓటమిని ఎరుగని నేతగా ఘనతకెక్కారు హరీశ్‌రావు. బుధవారం ఆయన పుట్టిన రోజు.

సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న వ‌రుస‌గా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 32 ఏళ్ల వ‌య‌సులో తొలిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన హ‌రీష్ రావు, అప్ప‌టినుంచి వెనుతిరిగి చూసుకోకుండా తెలంగాణ‌లో బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగారు. కేసీఆర్ మేనల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారు హరీశ్‌రావు. తనకు పార్టీ అప్పజెప్పిన ఏ పనిని అయినా విజయవంతంగా పూర్తి చేయడంలో హరీశ్ రావు అందరికంటే ముందుంటారని పార్టీ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు.

మంత్రి హరీశ్‌రావుకు ట్విట్టర్‌ ద్వారా.. కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డైనమిక్, నిత్యశ్రామికుడు, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలన్నారు. ప్రజాసేవలో మరింతగా ఆరోగ్యమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలి బావా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ, రాజకీయంగా కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనంద దాయకమన్నారు.

హరీశ్‌రావుకు.. మాజీ ఎంపీ కవిత ట్విట్టర్‌లో బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్‌ డే బావా అంటూ కవిత ట్వీట్ చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు హరీశ్‌రావు. కరోనా నేపథ్యంలో ఈసారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. అందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ.. తన జన్మదిన వేడుకలు నిర్వహించవద్దని కోరుతున్నట్టు ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES