మెట్రో ట్రెయిన్ వచ్చే టైమైంది..

మెట్రో ట్రెయిన్ వచ్చే టైమైంది..

లాక్‌డౌన్‌‌.. అన్‌లాక్ మొదటిదశ జూన్ ఒకటి నుంచి మొదలైంది. గత రెండు నెలలుగా మూతబడి ఉన్న అన్ని వ్యాపార, పారిశ్రామిక రంగాలు మళ్లీ తెరుచుకున్నాయి. ఇక హైదరాబాద్ మెట్రోకూడా మరికొద్ది రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. జూన్ మూడో వారం నుంచి మెట్రోని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో మెట్రోలో వెయ్యిమందిని ఒకేసారి తరలించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు వీలుగా.. 500 నుంచి 600 మందిని మాత్రమే తరలించేందుకు అవకాశం కల్పిస్తారు. సామాజిక దూరం పాటించేలా.. రైల్ లో సర్కిల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఇక.. లిప్ట్ లు, ఎస్క్‌లేటర్లు ఎక్కేవాళ్లు చేతివేళ్లను వాడకుండా కాలివేళ్లతో నొక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై మెట్రోలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దీనిని హైదరాబాద్ మెట్రోలో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. దీని వలన కరోనా వ్యాప్తికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మెట్రోస్టేషన్‌లో ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు. ఇలా కరోనా వ్యాప్తికి అవకాశం లేకుండా మైట్రోకార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్దం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story