పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఆటోడ్రైవర్..

పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఆటోడ్రైవర్..
X

కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే మరో మార్గం లేదు.. శుభ్రత పాటించాలి. కేసుల సంఖ్య కాస్త తగ్గు ముఖం పట్టినా మళ్లీ వైరస్ మన దరికి చేరకూడదంటే వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి. కొంత మంది ఏ జాగ్రత్తలు పాటించకుండా రోడ్ల మీద తిరిగేస్తున్నారు. అలాంటి వారు కేరళకు చెందిన ఈ ఆటో డ్రైవర్‌ని చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఆటోలోనే సబ్బునీళ్ల బాటిల్‌ను ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కే వారంతా సబ్బు నీటితో ముందు శుభ్రం చేసుకున్నాకే ఆటో ఎక్కేలా చూస్తున్నాడు.

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వీడియోను పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్‌లో షేర్ చేశారు. పలువురికి ఈ ఆటో డ్రైవర్ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. జాగ్రత్తలు తీసుకోపోతే కరోనా కాచుక్కూర్చుంటుంది అటాక్ చేయడానికి. వీలైనంత వరకు ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు పాటించడానికి ప్రయత్నిద్దామని.. కరోనాని తరిమికొడదామని ఆటో ఎక్కే కస్టమర్లకు చెబుతుంటాడు.

Next Story

RELATED STORIES