నిహారిక అందం అదరహో..

నిహారిక అందం అదరహో..

మెగాడాటర్ నిహారిక బుల్లితెర మీద సందడి చేసింది ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్‌లో నటించి. ఆపై యాంకర్‌గా, పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఈ మధ్యే నాన్న నాగబాబు నిహాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. పెళ్లయ్యేలోపు వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించాలని నిహా అనుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో ఓ రొమాంటిక్ చిత్రంలో నటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నిహారిక తాజాగా 'తులిప్' మేగజీన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ మేగజీన్ అయిన తులిప్ పదో వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన కవర్‌పేజీపై నిహారిక హాట్‌గా కనిపించింది. బ్యాక్‌లెస్ ఫోజుతో దర్శనమిచ్చింది. ఈ ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తులిప్ కవర్‌పేజీపై కనిపించడం సంతోషంగా ఉంది.. థ్యాంక్యూ ఫ్రెండ్స్ అని కామెంట్ చేసింది. ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నిహా అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అందం అదరహో అని కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

Happy to be featured in the 10th anniversary edition of @tulipmag Congratulations guys! @masuu20

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Tags

Read MoreRead Less
Next Story