అక్కడ మాస్కు ధరించకుంటే మూడు వేలు ఫైన్..

అక్కడ మాస్కు ధరించకుంటే మూడు వేలు ఫైన్..

మాస్కులు ధరించే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్ లో ఎవరైనా మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే వారికి మూడు వేల పాకిస్తాన్ రూపాయలు (భారత కరెన్సీలో సుమారు 1400 రూపాయలు) జరిమానా విధించబడుతుందని తెలిపింది. ఈ విషయాన్నీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సలహాదారు జాఫర్ మీర్జా చెప్పారు. మసీదులు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా, విమానాలు , ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. కాగా పాకిస్థాన్ లో ఇప్పటివరకు 72 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 1553 మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story