అమెరికాలో కరోనావైరస్ కేసులు @ 1.8 మిలియన్లు..

X
By - TV5 Telugu |3 Jun 2020 8:47 PM IST
అమెరికాలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, గత 24 గంటల్లో యుఎస్‌లో 20 వేల 461 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1015 మంది కూడా మరణించారని పేర్కొంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ సోకిన వారి సంఖ్య 1.8 మిలియన్లు దాటిందని.. మృతుల సంఖ్య లక్ష 6 వేలు దాటిందని తెలిపింది. కాగా కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన న్యూయార్క్‌లో 371,711 వైరస్ కేసులు, 29,917 మరణాలు సంభవించాయి. ఆ తరువాత న్యూ జెర్సీ లో 11,771 మరణాలు సంభవించాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com