మరో చారిత్రక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం

మరో చారిత్రక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు చేసే దిశలో కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వన్ నేషన్ వన్ మార్కెట్ విధానానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. నిత్యావసరాల చట్ట సవరణకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఇకపై రేతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్లలోని లైసెన్స్‌డ్ వ్యాపారుల వద్దే పంట ఉత్పత్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రేటు ఎక్కడ ఎక్కువగా వస్తే అక్కడే పంట ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు.

ఢిల్లీలోని 7 క‌ల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో కేంద్రమంత్రులు సమావేశమయ్యారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితి, ఆత్మనిర్భర్‌ భార‌త్ ప్యాకేజీలో కేటాయిం పుల‌ు, ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఈ మీటింగ్‌లో చర్చించారు. దేశంలో క‌రోనా క‌ట్టడికి చ‌ర్యలు కొనసాగిస్తూనే, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచన లు జరిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్రమంత్రివర్గం మూడు నిర్ణయాలు తీసుకుంది. వన్ నేషన్ వన్ మార్కెట్‌ విధానం, నిత్యావసరాల చట్ట సవరణ, కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ పేరును శ్యామాప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్‌గా మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story