నిసర్గ తుపాన్.. 17 ఇండిగో విమాన సర్వీసులు రద్దు

నిసర్గ తుపాన్.. 17 ఇండిగో విమాన సర్వీసులు రద్దు
X

ముంబై నగరాన్ని నిసర్గ్ తుపాన్ ముంచెత్తుతోంది. ముందు జాగ్రత్త చర్యగా 17 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. బుధవారం ముంబై నుంచి కేవలం 3 విమానాలను మాత్రమే నడిపామని, 17 విమాన సర్వీసులను రద్దు చేశామని ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు. విస్తారా ఎయిర్‌లైన్స్ కూడా తమ రాకపోకలను రద్దు చేసింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని విమానయాన సంస్థల అధికారులు తెలిపారు. విమానాశ్రయం రన్‌వేపై నీరు నిలవకుండా పంపులను ఏర్పాటు చేసి నీటిని బయటకు తోడేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతపై విమానాశ్రయ అధికారులు సమావేశమై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి చర్చించారు.

Next Story

RELATED STORIES