ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కన్నుమూత
X

బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జీ కన్నుమూశారు. 93 ఏళ్ల బసు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చోటీసీ బాత్, రజనీగంధ, బాతో బాతో మే, ఏక్ రుకాహువా పైసలా, చమేలీకి షాది తదితర సినిమాలకు బసు దర్శకత్వం వహించారు. హిందీతో పాటు బెంగాలీలో కూడా ఆయన అనేక సినిమాలు తీశారు. బసు సినిమాలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయని అంటారు. అమితాబ్ బచ్చన్‌తో మంజిల్, రాజేశ్ ఖన్నాతో చక్రవ్యూహ్, దేవానంద్‌తో తీసిన మన్ పసంద్ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అనేక టీవీ సీరియళ్లకు కథ, మాటలు సమకూర్చారు. 1992లో బసు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు.

Next Story

RELATED STORIES