కేరళ ఘటన వింటుంటే భయమేస్తోంది : కోహ్లీ

కేరళ ఘటన వింటుంటే భయమేస్తోంది : కోహ్లీ
X

సెలబ్రిటీల నుంచి నెటిజన్ల వరకు అంతా కేరళలోని మళప్పురం ఘటనపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గర్భంతో ఉన్న ఏనుగును పైనాపిల్‌ లో పటాసులు పెట్టి చంపేసిన విషయం తెలుసుకొని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మానవ మృగాలపై మండిపడ్డాడు. కేరళలో జరిగిన ఘటన వింటుంటూనే భయం వేస్తోందన్నాడు. మన చుట్టూ ఉండే మూగజీవాలను ప్రేమతో ఆదరిద్దామన్న కోహ్లీ.. ఇకనైనా ఇలాంటి పిరికి చర్యలకు ముగింపు పడాలని కోరుతూ ట్వీట్ చేశాడు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా కేరళా ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ఘటన చూసిన తర్వాత జంతువుల కంటే మనుషులే ఎక్కువ క్రూరంగా ఉన్నారని..జంతువులు మనుషుల కంటే ఎక్కువ మానవత్వంతో ఉన్నాయని ట్వీట్ చేశారు.

Tags

Next Story