యూట్యూబ్‌లో చూసి పీపీఈ కిట్లు తయారు చేసి..

యూట్యూబ్‌లో చూసి పీపీఈ కిట్లు తయారు చేసి..

నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి యూట్యూబ్ ఓ మంచి వేదిక అవుతోంది. రాజస్థాన్ కోటా ప్రాంతానికి చెందిన స్వయం సహాయక బృందంలోని మహిళలు యూట్యూబ్ చూసి పీపీఈ కిట్లు తయారు చేయడం నేర్చుకున్నారు. 45 నిమిషాల్లో ఒక కిట్ సిద్ధం చేసేస్తున్నారు. బయట మార్కెట్లో పీపీఈ కిట్ ధర 450 నుంచి 600 రూపాయల మధ్య ఉంటే కోటా మహిళలు తయారు చేసే పీపీఈ కిట్ రూ.320లకే దొరుకుతుంది.

వీరు ఇంకా డాక్టర్లకి గౌన్లు, కోట్లు, నర్సుల గౌన్లు, ఫుల్ మాస్కులు, క్యాపులు రూపొందిస్తారు. కోటా కార్పొరేషన్ కమిషనర్ వాసుదేవ్ మాలావత్ మాట్లాడుతూ పీపీఈ కిట్లను, మాస్కులను తయారు చేయడంలో రాజస్థాన్‌లోని కోటా జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ సలహాలకు అనుగుణంగా మహిళలు ఈ కిట్లు రూపొందించారని ఆమె అన్నారు. కిట్ కోసం వారు 90 జీఎస్ఎం ఫ్యాబ్రిక్ ఉపయోగించారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story