తాజా వార్తలు

అటవీశాఖ అధికారులపై స్థానికులు దాడి

అటవీశాఖ అధికారులపై స్థానికులు దాడి
X

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామ శివార్లలో.. అటవీశాఖ అధికారులపై స్థానికులు దాడి చేశారు. అడవిలోని రాళ్లను ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తుండగా... ఫారెస్టు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారిపై కర్రలు, రాళ్లతో 15 మంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

రాళ్లను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి... ఫారెస్ట్ కార్యాలయానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు జరిపిన దాడిలో ఆరుగురు ఫారెస్ట్‌ సిబ్బందికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనపై... అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్‌లో అటవీశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.

Next Story

RELATED STORIES