ఆర్బీఐ మారటోరియానికి అవకాశం ఇచ్చి వడ్డీ వసూలు చేయడాన్నితప్పుపట్టిన సుప్రీంకోర్టు

ఆర్బీఐ మారటోరియానికి అవకాశం ఇచ్చి వడ్డీ వసూలు చేయడాన్నితప్పుపట్టిన సుప్రీంకోర్టు

కరోనా కారణంలో ఈఎంఐలు కట్టేవారికి ఆర్బీఐ మార్చి1 నుంచి ఆగస్టు31 వరకు మారటోరియానికి అవకాశం ఇచ్చింది. అయితే, ఆ ఆరునెలలు వడ్దీ విధిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సర్వోన్నత్త న్యాయస్థానం.. ఆర్బీఐపై తీవ్రంగా మండిపడింది. ఓవైపు మారటోరియానికి అవకాశం ఇస్తూనే.. మరోవైపు వడ్డీ వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. ప్రజల ఆరోగ్యం కంటే.. ఆర్థిక కార్యకలాపాలు ముఖ్యంకాదని స్పష్టం చేసింది. మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ చేయాలని ధాఖలైన కేసులలో సుప్రీం కోర్టులో ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ఆరునెలల కాలంలో మారటోరియానికి వడ్డీ వసూలు చేయకపోతే.. బ్యాంకులు రెండు లక్షల కోట్లు నష్టపోతారని ఆర్బీఐ.. సుప్రీం కోర్టు ముందు తెలిపింది. దీంతో సుప్రీం తీవ్రంగా మండిపడింది. మీడియాకు లీకులు ఇస్తూ.. ఈ విషయాన్ని ఆర్బీఐ మరింత సంచలనం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story