గుజరాత్ లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ

గుజరాత్ లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ

గుజరాత్ లో రెండు రాజ్యసభ సీట్లు గెలవాలని అనుకున్న కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జితు చౌదరి గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదిని బుధవారం కలుసుకుని తమ రాజీనామాలను అందజేశారు. అయితే వారి రాజీనామాలను ఆమోదించినట్లు స్పీఎకర్ త్రివేది గురువారం విలేకరులతో అన్నారు. ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ఆయన స్పష్టం చేశారు. కాగా అక్షయ్ పటేల్ వడోదర లోని కర్జన్ సీటుకు ప్రాతినిధ్యం వహించగా, చౌదరి వల్సాద్ కప్రాడా సీటు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.

అంతకుముందు బుధవారం, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిరిత్ పటేల్, లలిత్ వాసోయ, లలిత్ కగతారాగా లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్లను కలుసుకున్నారు, వీరు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే వేరే ఇద్దరు ఆ పార్టీకి రాజీనామా చేసి ఝలక్ ఇచ్చారు. కాగా గుజరాత్‌లో నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జూన్ 19న జరగాల్సి ఉంది. సంఖ్యా బలం ప్రకారం కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ, ఎమ్మెల్యేల రాజీనామాతో రెండవ సీటును గెలుచుకోవడం కష్టతరంగా మారింది. కాగా బీజేపీ మాత్రం ముగ్గురు అభ్యర్థులను బరిలో ఉంచింది.

Tags

Read MoreRead Less
Next Story