చైనా విమానాలు అమెరికాలోకి రానివ్వం..

చైనా మీద చల్లారని కోపం.. అమెరికా.. ఇకపై చైనా విమానం మా దేశంలో రానివ్వం అంటోంది. వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని ముందునుంచీ మొత్తుకుంటున్న అమెరికా చైనాతో రాకపోకలు కానీ, సంబంధాలు కానీ భవిష్యత్తులో కొనసాగించకూడదని నిర్ణయించుకుంటోంది. అందులో భాగంగానే చైనా విమానాలు తమ దేశంలోకి రానివ్వమని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో అమలు చేసే అవకాశం ఉందని అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జనవరి నుంచే వూహాన్ ప్రావిన్స్‌కు అమెరికా విమాన రాకపోకలను నిలిపివేసింది. జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభించాలనుకుంది. అయితే అందుకు సంబంధించిన అనుమతుల మంజూరు విషయంలో చైనా విఫలమైనందున అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య జరిగిన విమాన రాకపోకల ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని అమెరికా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది. ఈ విషయమై అమెరికా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వర్గాలు చైనాతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com