రాగి పాత్రలు వాడితే కరోనా..

రాగి పాత్రలు వాడితే కరోనా..

ఇది వరకటి రోజులు, అప్పుడు తిన్న తిండి, వాడిన పాత్రలు అవే మంచివంటారు ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లను కదిలిస్తే. అవును అదే నిజం అంటున్నారు శాస్త్రవేత్తలు సైతం. రాత్రి పూట రాగి చెంబులో నీళ్లు పోసి మంచం కింద పెట్టుకుని తాగే వారు అమ్మమ్మలు, తాతయ్యలు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే రాగి పాత్రలు వాడితే మంచిదంటున్నారు పరిశోధకులు.

రాగి పాత్రలు బ్యాక్టీరియా, ఫంగస్ వంటి మైక్రో ఆర్గానిజంని దరి చేరనీయదని చెబుతున్నారు. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే శరీరంలోని విష పదార్థాలు బయటకెళ్లిపోతాయని అంటున్నారు. కరోనా వైరస్ రాగి, ఇత్తడి మిశ్రమంతో తయారు చేసిన వస్తువులపై చేరితే త్వరగా చనిపోతుందని సౌతాంప్టన్ యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంటల్ హెల్త్‌కేర్ విభాగం ప్రొఫెసర్ బిల్ కీవిల్ వెల్లడించారు.

ఇన్‌ప్లూయెంజా, ఈ కోలి వంటి బ్యాక్టీరియాలతో పాటు కరోనా వైరస్ సైతం ఇతర వస్తువులపై అయితే నాలుగు రోజుల పాటు మనుగడ సాగించగలవు. మనం నిత్యం వాడే వస్తువులతో పాటు ఎక్కువగా ఉపయోగించే డోర్ హ్యాండిల్స్ వంటి వాటికి రాగిపూత వేసినట్లైతే కొంత వరకు వైరస్‌వ్యాప్తిని అరికట్ట వచ్చని పరిశోధకుల అభిప్రాయం. రాగి పాత్రల వాడకం అనేక అనారోగ్య సమస్యలను దరి చేరనీయకుండా చేస్తుంది. ఇమ్యూన్ సిస్టంను బలోపేతం చేస్తుంది. మరింకెందుకాలస్యం అటకెక్కించిన రాగి పాత్రలను క్రిందకు దించేద్దాం.

Tags

Read MoreRead Less
Next Story