మెట్రో రైల్ ఉద్యోగులకు కరోనా

మెట్రో రైల్ ఉద్యోగులకు కరోనా

దేశ రాజధాని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్లో పని చేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. తమ సంస్థలో పని చేసే వివిధ స్థాయి ఉద్యోగులకు వైరస్ సోకినట్లు సంస్థ తెలిపింది. దీనిపై మెట్రో రైల్ కార్పొరేషన్ ట్వీట్ చేస్తూ దేశం కరోనాపై యుద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగాన్ని మెట్రో సర్వీసులు ప్రారంభిస్తామని

అధికారులు ట్వీట్ చేశారు. మాస్క్, గ్లోవ్స్ ధరించిన బాలిక ఫోటోను ట్విట్టర్లో ఉంచారు. ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేసేందుకు వీలుగా మెట్రో రైల్ కార్యాయాలు, రైల్వేస్టేషన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయిస్తామని అన్నారు. వైరస్ వ్యాప్తి జరగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెట్రో అధికారులు వెల్లడించారు.

కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 23,645 పాజిటివ్ కేసులు నమోదు కాగా 606 మంది మరణించారు. 9,542 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story