కరోనా కాలం.. పిల్లల్ని కనొద్దు..

కరోనా కాలం.. పిల్లల్ని కనొద్దు..

గర్భం దాల్చింది మొదలు ఆస్పత్రుల చుట్టూ తిరగాలి. చెకింగులు, స్కానింగులు అంటూ నెలకోసారైనా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఆ తరువాత శ్రీమంతాలని చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి. డెలివరీ అయితే బారసాల, అన్నప్రాసన, పుట్టిన రోజులంటూ ఎన్నో వేడుకలు. అసలే కరోనా కాలం. మనకే రక్షణ లేదంటే ఇంక పుట్టబోయే బిడ్డల పరిస్థితి ఏంటి.. అందుకే కొన్ని రోజులు కాదు కాదు రెండేళ్లు ఆగండి ఆ తరువాత కనండి పిల్లలని అంటున్నారు కొత్తగా పెళ్లైన జంటలని..

మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా గోధేగావ్ వాసులు. అక్కడ ఒకేసారి 60 పెళ్లిళ్లు జరిగాయి. వాళ్లందరికీ ఇప్పుడే పిల్లలు కనొద్దని చెప్పారు ఊరి ప్రజలు. గర్భం దాల్చి శిశువును ప్రమాదంలోకి నెట్టకూడదని గ్రామ పంచాయితీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే మహిళలు సైతం ఈ నిర్ణయానికి ఓకే చెప్పారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా వారి కుటుంబాల్లో మహిళలు గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story