సుందరమ్మ సూడ సక్కగుంది.. వెంకటేష్ సరసన..

సుందరమ్మ సూడ సక్కగుంది.. వెంకటేష్ సరసన..

వెంకటేష్ హీరోగా, ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'నారప్ప'. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటి ప్రియమణి మొదటి సారి విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె సుందరమ్మగా నటిస్తోంది. ఈ రోజు ప్రియమణి పుట్టినరోజు. ఈ సందర్భంగా నారప్ప టీం సభ్యులు ప్రియమణికి శుభాకాంక్షలు అందజేస్తూ సుందరమ్మ పాత్ర లుక్‌ని విడుదల చేసింది. ‌‌‌ఈ లుక్‌లో పల్లెటూరి అమ్మాయిలా పేరుకు తగ్గట్టు ఉంది ప్రియమణి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లిరిక్స్ సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత శ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story