అందుకే అమెరికా వెళ్లాం: సన్నీ లియోన్

అందుకే అమెరికా వెళ్లాం: సన్నీ లియోన్

అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. అయినా సన్నీలియోన్ అమెరికాలోనే ఉండి తన అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఓ పత్రికతో ఇదే విషయాన్ని పంచుకున్నారు సన్నీ. కరోనా విజృంభిస్తున్న తరుణంలో తన భర్త డేనియల్, ముగ్గురు పిల్లలు కలిసి అమెరికా వెళ్లామన్నారు. డేనియల్ కుటుంబసభ్యులకోసమే తాము ఇండియా నుంచి అమెరికా వచ్చామని తెలిపారు. ముంబయి వదిలి రావడం బాధగా అనిపించింది. చాలా రోజులు ఆలోచించిన తరువాతే అమెరికా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. డేనియల్ వాళ్ల అమ్మగారు వయసులో చాలా పెద్దవారు. ఆమెకు ఇప్పుడు మా అవసరం ఎంతో ఉంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే నేను అమెరికా వెళ్లాను. పరిస్థితులు చక్కబడ్డాక.. అంతర్జాతీయ విమానాలకు అనుమతులు లభిస్తే వెంటనే ఇండియాకి వచ్చేస్తాం అని సన్నీ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story