నెల రోజుల క్రితమే పెళ్లైంది.. ఫోన్లో భర్త రాచకార్యాలు చూసి..

నెల రోజుల క్రితమే పెళ్లైంది.. ఫోన్లో భర్త రాచకార్యాలు చూసి..
X

పెళ్లైన నెలరోజులకు భర్త బాగోతం బయటపడింది. భార్య భావన అది చూసి తట్టుకోలేక తనువు చాలించింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆనంద నగర్ కు చెందిన భావనకు నెల రోజుల క్రితం సాప్ట్ వేర్ ఇంజనీర్ అజయ్ తో వివాహం జరిగింది. పెళ్లికి ముందు నుంచే అజయ్ మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ విషయం భావనకు పెళ్లయ్యాక తెలిసింది. అయినా పెద్దలు సర్థిచెప్పడంతో సంసారాన్ని కొనసాగించారు కొత్త దంపతులు. కానీ ఓ రోజు భర్త అజయ్ మొబైల్ చూసింది భావన.

అందులో భర్త మరో మహిళతో ఉన్న ఫోటోలు కనిపించాయి. అసభ్యకర దృశ్యాలు ఆమె కంట పడ్డాయి. దాంతో ఆమె అజయ్ ని నిలదీసింది. నీతో కాపురం చేయలేనంది. పెద్దలు కల్పించుకున్నా భర్తలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన భావన శుక్రవారం ఉదయం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలో అడుగు పెట్టిన భావన కాళ్ల పారాణి కూడా ఆరకముందే బలవన్మరణానికి పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES