ఆ మూడు రాష్ట్రాల్లోనే 70 వేలకు పైగా కరోనా యాక్టీవ్ కేసులు..

ఆ మూడు రాష్ట్రాల్లోనే 70 వేలకు పైగా కరోనా యాక్టీవ్ కేసులు..
X

దేశంలో కరోనా రోగుల సంఖ్య 2 లక్షల 37 వేల 754 కు పెరిగింది. ఈ గణాంకాలు Covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా శనివారం కరోనా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం గత 24 గంటల్లో 9887 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, 294 మంది మరణించారు. ఈ కాలంలో దేశంలో సోకిన వారి సంఖ్య 2 లక్షల 36 వేల 657 కు పెరిగింది. లక్షా 14 వేల 073 మంది ఆరోగ్యంగా ఉన్నారు. అదే సమయంలో ఇప్పటివరకూ మొత్తం 6642 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో లక్షా 15 వేల 942 క్రియాశీల కేసులు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది.

వీటిలో, మహారాష్ట్ర, ఢిల్లీ , తమిళనాడులలోనే 70235 క్రియాశీల కరోనా కేసులు ఉన్నాయి, ఇది మొత్తం 60.57% గా ఉంది. మరోవైపు కరోనా పరీక్షల కోసం గత 6 రోజుల్లో 66 కొత్త ల్యాబ్‌లు తెరిచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 48 ప్రభుత్వ, 18 ప్రైవేటువి ఉన్నాయి. వీటిద్వారా ప్రతి రోజు 10 వేలకు పైగా నమూనాలను పరీక్షిస్తారు. గత 24 గంటల్లో 1 లక్ష 37 వేల 938 నమూనాలను పరిశీలించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 45 లక్షల 24 వేల 317 మందికి కరోనా పరీక్షలు జరిగాయి.

Next Story

RELATED STORIES